కన్నతల్లి కర్కశత్వం..!

post

చిరుతిండి కొనివ్వమని అడిగిన పాపానికి.. ఓ తల్లి నడిరోడ్డు మీద కొడుకుపై కర్కశంగా ప్రవర్తించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కంభం పట్టణానికి చెందిన ఫరిదా… కొడుకు సాహిజ్‌ను అతి కిరాతకంగా కొడుతూ బజారులో ఈడ్చుకుంటూ వెళ్లిన తీరు పలువురిని కలచివేసింది. నడిరోడని కూడా చూడకుండా.. ఆ తల్లి కొడుకును చితకబాదింది. ఈ దృశ్యాలు CC కెమెరాలో రికార్డు అయ్యాయి. దృశ్యాలు చూసిన వారంతా కన్నతల్లిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.