ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అమితాబ్, మహేష్ బాబు

post

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ అగ్రకథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్‌, హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి.. అమితాబ్‌, మహేశ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.