ఏడాది బాలుడికి రూ. 7 కోట్ల లాటరీ

post

భారత్‌కు చెందిన ఏడాది వయసున్న బాలుడు లాటరీతో కోటీశ్వరుడైపోయాడు.. యూఏఈలో ఆ బాలుడి పేరు మీద తండ్రి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) గెలుచుకుంది. భారత్‌కు చెందిన రమీస్‌ రహ్మాన్‌ దుబాయ్‌కి చెందిన లాటరీ టికెట్‌లను ఏడాదిగా కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు మహ్మద్‌ సలాహ్‌షా పేరు మీద టికెట్‌ కొన్నాడు. మంగళవారం తీసిన నెలవారీ డ్రాలో రహ్మాన్‌ టికెట్‌ 1 మిలియన్‌ డాలర్లను గెలుచుకున్నట్లు గల్ఫ్‌ న్యూస్‌ పత్రిక వెల్లడించింది.