శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ..!

post

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు నల్లగొండ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి, బాలికలపై జరిగే నేరాల విచారణ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ముగ్గురు మైనర్ బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిర్ధారణ అయిందని న్యాయమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా భావిస్తూ నిందితుడికి అంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి చేసిన నేరం రుజువైందని న్యాయమూర్తి అతడికి చెప్పారు. ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని ప్రశ్నించారు. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, కొందరు పోలీసులు తనను కావాలనే ఇరికించారంటూ ఆరోపించాడు. తనకు తల్లిదండ్రులు ఉన్నారని, వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనమీదే ఉందని చెప్పాడు. ఆ సమయంలో జడ్జి జోక్యం చేసుకుని మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారో తెలుసా అని ప్రశ్నించారు. అయితే, తనకు తెలియదని చెప్పాడు.  అలాగే, తన మీద కోపంతో ఇల్లు కూల్చేశారని, తన అన్న వదినను కూడా గ్రామం నుంచి వెళ్లగొట్టారని చెప్పాడు. అయితే, నేరం రుజువైందని జడ్జి చెప్పిన సమయంలో శ్రీనివాస్ రెడ్డిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని ప్రత్యేక్ష సాక్షులు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి మీద మొత్తం మూడు కేసులు ఉన్నాయి. అయితే, ఈ మూడు కేసులకు సంబంధించి పోలీసులు విడివిడిగా విచారణ జరిపి, చార్జిషీట్‌లు దాఖలు చేశారు. అయితే, న్యాయమూర్తి వాటన్నిటినీ కలిపి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.