మిడతలతో పడలేక పాక్ లో ఎమర్జెన్సీ విధింపు..!

post

ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్ ను మిడతల దండు భయపెడుతోంది. పాకిస్తాన్ తో పాటు, సరిహద్దు ప్రాంతాలైన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలకు వీటి బెడద తప్పట్లేదు. ఇప్పటికే, పంజాబ్ ముఖ్యమంత్రి మిడతల దాడి పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కోరారు. మిడతలను తరమడం కోసం వంటపాత్రలను కర్రలతో మోదుతూ శబ్దాలు చేస్తున్నారు. లౌడ్ స్పీకర్లలో పాటలు పెట్టి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. గోధుమ సాగు చేస్తున్న కొన్నిచోట్ల.. మిడతలను చంపడం కోస ఫైర్ ట్యాంకర్లతో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. భారత్ మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదు. పాకిస్తాన్ కూడా వీటిపై చర్యలను ముమ్మరం చేస్తేనే వీటిని అరికట్టవచ్చు.
లక్షల సంఖ్యలో మిడతలు ఒక్కసారిగా దాడి చేయడం తో పాకిస్తాన్ ప్రభుత్వం వీటిని అరికట్టలేక నానా అవస్థలు పడుతోంది. ఇవి ఒక్కసారిగా 150 కిలోమీటర్ల వేగం తో పరిగెత్తగలవు. వీటి సంతతి ని కూడా త్వరితగతిన అభివృద్ధి చెందించుకోగలవు. వర్షాభావ పరిస్థితులు, వాతావరణం పొడిగా ఉండటం వంటి కారణాల వల్ల వీటి దండయాత్ర అధికమైంది. అటువైపు పాకిస్తాన్ లో ఎన్నడూ లేనంతగా మిడతల దండు విజృభిస్తోంది. వీటిని అరికట్టలేక పాక్ ఇక్కట్లు పడుతోంది. తాజాగా, ఎమర్జెన్సీ ని విధించింది. పంజాబ్ ప్రావిన్స్ వైపు పంట భూములు ఉన్న కారణం గా అటువైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ , రాజస్థాన్ ఎడారి వైపు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనితో, మిడతలు అటువైపు నుంచి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలవైపు దండయాత్ర చేస్తున్నాయి. రసాయన మందుల పిచికారీ తో వీటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.