మాకు కరోనా మెడిసిన్ దొరికిందోచ్..!

post

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్న నేపధ్యం లో థాయిలాండ్ ఓ సంచలన ప్రకటనను చేసింది. చైనా తరువాత అత్యధికం గా కరోనా వైరస్ ఉన్న దేశం ధాయిలాండ్. అయితే, ఈ వైరస్ ను అణచడానికి శాస్త్రవేత్తలు కిందా మీద పడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ముమ్మరం గా పరిశోధనలు చేస్తున్నాయి. థాయిలాండ్ లో ఒక ముదుసలి ఆవిడ కు కరోనా వైరస్ సోకి నానా అవస్థ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె శరీరం నుంచి పూర్తిగా కరోనా వైరస్ ను తొలగించేశామని థాయిలాండ్ ప్రకటించింది. ఫ్లూ, హెచ్ఐవీ చికిత్సల్లో అందించే మందులను వివిధ మోతాదులలో కరోనా వైరస్ పై ప్రయోగించడం ద్వారా ఆ వైరస్ ను అదుపు చేయగలిగారు. అయితే, ఈ ప్రయత్నం సక్సెస్ కావడం తో ధాయిలాండ్ ప్రభుత్వము, ప్రజలు సంతోషం లో ఉన్నారు.