ఇంటి నుంచే లెర్నింగ్‌ లైసెన్స్ ..!

post

రవాణాశాఖ సేవల కోసం కార్యాలయాలకు వాహనదారులు వచ్చే అవసరం లేకుండా దాదాపు అన్ని సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా లెర్నింగ్‌ లైసెన్సులూ(ఎల్‌ఎల్‌ఆర్‌) ఆన్‌లైన్‌ ద్వారా పొందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా దళారీ దందాకు అడ్డుకట్ట వేయనున్నారు. ప్రస్తుతం లెర్నింగ్‌ లైసెన్సు కావాలంటే సంబంధిత ఆర్టీఏ కార్యాలయం పరిధిలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. కేటాయించిన సమయానికి వెళ్లి పరీక్ష రాయాలి. పది నిమిషాల సమయంలో 20 మార్కులకు కనీసం 12 వస్తే.. పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు భావించి లైసెన్సు జారీచేస్తారు. అనంతరం ఆరు నెలల్లోపు డ్రైవింగ్‌ టెస్టు పెట్టి అందులో పాసైతే నిర్ణీత కాలానికి లైసెన్సు అందజేస్తారు.