బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ..!

post

 

బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రఘనందన్‌రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆమె మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘునందన్‌ తనను, తన కుమారుడిని హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చిన అమ్మాయిలకు మత్తుమందు కలిపి వారిపై అత్యాచారం చేసేవారని తెలిపారు. అంతేకాకుండా ఓ టాలీవుడ్‌ ప్రముఖ హీరో సోదరుడికి రఘునందన్‌ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.