ట్రాన్స్‌ట్రాయ్‌ ఆస్తులు విక్రయించనున్న ఆంధ్రా బ్యాంక్‌

post

ట్రాన్స్‌ట్రాయ్‌(ఇండియా) లిమిటెడ్‌ నుంచి రూ.837 కోట్ల బకాయిలను వసూలు చేసుకోవటంలో భాగంగా సంస్థకు చెందిన ఆస్తులను 23న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఆంధ్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్‌, కోఠిలోని స్పెషలైజ్డ్‌ అసెట్‌ రికవరీ మేనేజ్‌మెంట్‌ శాఖ ప్రకటన జారీ చేసింది. వేలం ద్వారా గుంటూరులోని 22,500 చదరపు అడుగుల వాణిజ్య భవనంతో పాటు ఢిల్లీలోని ద్వారకా వద్ద ఉన్న ఫ్లాట్‌ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఆసక్తి కొనుగోలు ద్వారా తమ ఈఎండీని వచ్చే నెల 20వ తేదీలోగా సమర్పించాలని పేర్కొంది.