అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి....

ఆదివారం ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో అమరులైన వీర జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,సీఎం భూపేందర్ సింగ్ బాఘేల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఎన్కౌంటర్లో గాయపడిన జవాన్లను అమిత్‌షా పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులతో ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది . ఈ సమావేశంలో రాష్ట్ర సీఎం భాగేల్ కూడా పాల్గొననున్నారు . మావోయిస్టుల ఆరికట్టు చర్యల గురించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఎన్కౌంటర్ జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే సీఆర్పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి అక్కడ కూడా ఓ సమావేశం నిర్వహించనున్నారు.