బాబూ జగ్జీవన్‌ రామ్ కు సీఎం జగన్ ఘన నివాళి....

post

స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి,ఏపీ సీఎం నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ నివాళులర్పించారు. ఈ కార్య్రమానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. ఇక అంతకుముందు... "స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది." అంటూ సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.