తమిళనాడులో ఓటేసిన తమిళిసై...

post

తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళిసై తన సొంత రాష్ర్టమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నది . చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ఈ సందర్భంగాఅనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటు వేయడమనేది మన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం అని, అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద  కరోనా  నిబంధనలు పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3,998 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు . ఈ సందర్బంగా తమిళనాడులో 88,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.