చెన్నైతో మ్యాచ్‌కు ఆ ఇద్దరు పేసర్లు దూరం...

post

సౌతాఫ్రికా పేసర్లు అన్రిచ్ నోర్ట్జే ,కగిసో రబాడ ఈరోజు ముంబై చేరుకొని ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ హోటల్‌కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాలి కాబట్టి ఈ స్టార్‌ పేసర్లు ఇద్దరూ ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడే తొలి మ్యాచ్‌కు దూరంకానున్నారు. ఈ సీజన్ లో ఢిల్లీ తన మొదటి మ్యాచ్ ని ఏప్రిల్‌ 10న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రిషబ్‌ పంత్‌ సారథ్యంలో తలపడనుంది. పోయిన సంవత్సరం యూఏఈ వేదికగా జరిగిన లీగ్‌లో ఫాస్ట్‌బౌలర్లు సంచలన ప్రదర్శన చేసి జట్టును తొలిసారి ఫైనల్‌ వరకు తీసుకెళ్లారు. డీసీ ఫ్యామిలీలోకి పేసర్లు వచ్చేశారని ఫ్రాంఛైజీ ట్వీట్‌ చేస్తూ ఈ ఇద్దరు ఆటగాళ్లు దిగిన ఫొటోను షేర్‌ చేసింది.