ఉమెన్స్ ఐపీఎల్ విజేత ట్రయల్‌ బ్లేజర్స్.......

post

షార్జా వేదికగా మహిళల టీ 20 ఛాలెంజ్ ఫైనల్స్ లో ట్రయల్‌ బ్లేజర్స్ , డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్ మధ జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఈ జట్టులో కెప్టెన్ స్మృతి 49 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది. అనంతరం 119 పరుగుల లక్ష్య ఛేదనలో సూపర్‌నోవాస్‌ తడబడి నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది. దీనితో ఈ సంవత్సరం మందాన జట్టు మొదటిసారి ఉమెన్స్ ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఈ మ్యాచ్ లో అర్ధశతకం చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రయల్‌ బ్లేజర్స్‌ కెప్టెన్ స్మృతి మందాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా , రాధా యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకుంది.