తెలంగాణ నైట్ కర్ఫ్యూ... 

post

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ ... ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే  ఈ  నైట్ కర్ఫ్యూ ఈ రోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు అమలులో ఉండనున్నది . ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో  అత్యవసర సేవలకు మాత్రమే పర్మిషన్ లు ఉన్నాయి. సిఎన్జీ, గ్యాస్,ఎల్పీజీ, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. నీటి సరఫరా, పారిశుధ్యం పనులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ కామర్స్ యాప్స్ ద్వారా జరిగే ఆహార పదార్ధాల పంపిణీకి మినహాయింపు. మెడికల్ షాపులకు ,ఆసుపత్రులకు , ల్యాబ్ లకు  ఈ  కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.