దుబ్బాక లో బీజేపీ ఘన విజయం.....

post

దుబ్బాక ఉపఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి బీజేపీ , టీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా  సాగి చివరకు 23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్‌కు 61302 ఓట్లు, బీజేపీకి 62772 ఓట్లు, కాంగ్రెస్‌కు 21819 ఓట్లు పోలయైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనితో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. ఈ విజయంతో బీజేపీ  కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకుంటూ , స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు.