కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గుజరాత్ సీఎం...

post

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీకాలు వేసుకునేందుకు జనం పోటీపడుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర జనం బారులుతీరి టీకాలు వేయించుకుంటున్నారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా  గాంధీనగర్‌లోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.