పంజాబ్‌ కింగ్స్‌ విజయం... 

post

ఐపీఎల్ లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ , ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 63) అర్ధ సెంచరీతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ లో అర్ధ సెంచరీ తో రాణించిన కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్‌), క్రిస్‌ గేల్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్‌) విజృంభించడంతో పంజాబ్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్ట పోయి విజయాన్ని అందుకున్నది .