కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...82కు చేరిన మృతుల సంఖ్య...

post

ఆదివారం తెల్లవారుజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరుకుంది. అంతేకాకుండా మరో 110 మందికి పైగా గాయాలయ్యాయి. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వలెనే ఈ ప్రమాదం చోటుకుందని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల ఇరాక్ ప్రధాని  స్పందిస్తూ ఆస్పత్రి అధికారులను విధుల నుంచి తొలగించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగకుండా హెచ్చరికలు జారీ చేశారు.