ఈరోజు బెంగాల్లో  ఎనిమిదోత పోలింగ్.... 

post

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  చివరిదైన ఎనిమిదోత విడ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు జరుగనున్నది . ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి బారులు తీశారు . మొత్తం 35 నియోజకవర్గాలలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ  ఎనిమిదోత విడ పోలింగ్ లో మొత్తం 84 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు . అయితే మే2న బెంగాల్ తో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.