ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.... 

post

ఐపీఎల్ 2021 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ ఓపెనర్లలో గిల్ (43) తో రాణించగా చివర్లో ఆండ్రీ రస్సెల్(45) తో రెచ్చిపోవడంతో  కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.  అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టులో ఓపెనర్లు రెచ్చిపోయారు. పృథ్వీ షా మొదటి ఓవర్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు లతో మొదలైన అతని తుఫాన్ ఇన్నింగ్స్  ఏ బౌలర్ ను వదలకుండా పరుగుల వరద పారిస్తుంటే ధావన్ మాత్రం నెమ్మదిగా  ఆడడంతో వీరు మొదటి వికెట్ కు 129 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ తరువాత ధావన్(46) పరుగులు చేసి ఔట్ అవ్వగా షా(82) అర్ధశతకం పూర్తి చేసి చివర్లో పెవిలియన్ చేరుకున్నాడు. ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.