ముంబై ఇండియన్స్‌ విజయం.... 

post

ఐపీఎల్ 2021 లో భాగంగా ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన 
రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది.కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 42; 5ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 41; 3ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (50 బంతుల్లో 70 నాటౌట్‌; 6ఫోర్లు, 2 సిక్స్‌లు)  అర్ధశతకంతో అదరగొట్టడంతో ముంబై 18.3 ఓవర్లలోనే 3 వికెట్ల కోలుపోయి విజయాన్ని సాధించింది.