కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... 

post

గుజరాత్‌లోని భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందగా ,మరికొందరు గాయపడ్డారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 70 మంది రోగులు చికిత్స తీసుకుంటుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు . ఈరోజు  ఉదయం వరకు 18 మంది మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు . హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో 50 మందిని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.