కూలిన మెట్రో ట్రైన్ వంతెన.. 13 మంది మృతి..

post

సోమవారం రాత్రి మెక్సికోలో మెట్రో ట్రైన్ వంతెన ప్రమాదవశాత్తు కూలిపోవడంతో 13 మంది మృతి చెందగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా వంతెన కింద ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.