డిజిటల్ ఫ్లాట్ ఫాంలో 'కలర్ ఫొటో' అరుదైన రికార్డ్...

post

ఇటీవలే ఆహా ద్వారా విడుదలైన 'కలర్ ఫొటో' సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది . చిన్నసినిమాగా రిలీజైన ఈ సినిమా  డిజిటల్ ప్లాట్‌ఫాంలో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆహాలో 50 మిలియన్ల నిమిషాలు స్ట్రీమింగ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు తెరవకపోవడంతో ఈ సినిమా ఇలాంటి ఘనత సాధించడమంటే అద్భుతమనే చెప్పాలి . సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సునీల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.