బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు మూసివేత......

post

శీతాకాలం ప్రారంభమైన కారణంగా ఉత్తరరాఖండ్‌లోని కొలువుతీరిన పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయం ద్వారాలను దేవస్థానం బోర్డు గురువారం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు మూసివేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు ఛార్‌దమ్‌ దేవస్థానం బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్‌, బద్రీనాథ్‌ దామం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఈశ్వరి ప్రసాద్‌ నంబూరితోపాటు తీర్థ పురోహితులు, వందలాది భక్తులు తలుపుల మూసివేత వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పటికే కేథరీనాథ్‌ ఆలయం, గంగోత్రి ఆలయాలను మూసివేశారు.