రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు...

post

ఏపీ రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కచ్చితంగా అమల్లో ఉండనుంది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సడలింపులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా,  తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు రెగ్యులర్‌ టైమింగ్స్‌ లలో పనిచేయనున్నాయి. సడలించిన వేళలు ఈనెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి. తూర్పుగోదావరిలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు కొనసాగనుంది.