భారత్‌ 146/3..

post

ఐసిసి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ భాగంగా సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శనివారం నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్  వెలుతురు లేమి కారణంగా ముందే నిలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ నిలిచేవరకు ఆచితూచి ఆడారు. తొలిరోజు వర్షం కారణంగా మైదానమంతా చిత్తడిగా మారడంతో న్యూజిలాండ్‌ బౌలర్లు చెలరేగడంతో భారత్‌ వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి 64.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి(44; 124 బంతుల్లో ఒక ఫోర్‌), అంజిక్యా రహానే(29; 79 బంతుల్లో 4ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్‌(34), శుభ్‌మన్‌(28) కలిసి తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత పుజారా(8) నిరాశపర్చినా.. కోహ్లి, రహానే కలిసి జట్టును ఒడ్డున పడేశారు. బౌల్ట్‌, జేమీసన్‌, వాగర్‌లకు తలా ఒక వికెట్‌ దక్కాయి.