ఈరోజు నుండి తుంగభద్ర పుష్కరాలు.......

post

ఈరోజు నుండి కర్నూల్ లో తుంగభద్ర పుష్కరాలు ఈరోజు మధ్యాహ్నం 01:21 కు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలు ఈరోజు నుండి (20 నవంబర్ నుండి డిసెంబర్ 1 ) 12 రోజుల పాటు జరుగనున్నాయి . ఈరోజు ముహూర్తం ప్రకారం 1:21 నిమిషాల నుండి అనుమతి ఇస్తున్నా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఏపీ ప్రభుత్వం ఘాట్ లోకి జనాన్ని అనుమతించేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ నెగటివ్ రిపోర్ట్ లేకుంటే కనక వారికి ధర్మ స్క్రీనింగ్ నిర్వహించి లోపలికి అనుమతించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు కర్నూలు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడే పుష్కరాలను ప్రారంభించనున్నారని సమాచారం.