గుజరాత్ లో మరో రోడ్డు ప్రమాదం.....

post

గుజరాత్‌లో ఈరోజు ఉదయం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. కానీ లారీ డంపర్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.