జకోవిచ్ ఖాతాలో 20వ గ్రాండ్‌స్లామ్‌...

post

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది ఆయన కెరీర్ లో ఆరో వింబుల్డన్ టైటిల్ కాగా, ఓవరాల్ గా 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడంతో కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన ఇప్పుడు జకో కూడా చేరాడు. ఫైనల్లో ఇటలీ ఆటగాడు మటీయో బెరెట్టినిపై జకోవిచ్ ఘనవిజయం సాధించాడు.