నేడు పూరిలో భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర.... 

post

ఈరోజు పూరీలో పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాబోతున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరం కూడా భక్తులు లేకుండానే ఈ రథయాత్ర జరుగుతున్నది. సేవకులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర జరుగుతుండటంతో పూరీలో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి పూరీకి ఎవర్నీ అనుమతించడంలేదని, పూరీలోని సామాన్య ప్రజలు, భక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని టీవీల్లో లైవ్ ద్వారా చూసుకోవాలని, ప్రత్యక్షంగా రథయాత్రలో పాల్గొనడానికి అనుమతులు లేవని ఒడిశా ప్రభుత్వం స్పష్టంచేసింది.