బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం...

post

హైదరాబాద్ లోని బాలానగర్ పారిశ్రామిక వాడ పరిధిలోని రంగారెడ్డి నగర్‌లో  ఈరోజు (మంగళవారం) ఉదయం  స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ పరిశ్రమలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే  అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే  ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.