టీ-20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్.,..

post

వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ టీ-20 ఫార్మాట్‌లో 14వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ-20లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గేల్ (67రన్స్ 38బంతుల్లో 4X4, 7X6) విరుచుకు పడటంతో 142 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విండీస్ ఘనవిజయం సాధించడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ-20ల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో సొంతం చేసుకుంది. అయితే విండీస్ తరుఫున గేల్ ఐదేళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించడం విశేషం.