దక్షిణాఫ్రికా పై 43 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం..

post

పసికూన ఐర్లాండ్,దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ గెలిచి  చరిత్ర సృష్టించింది.43 పరుగుల తేడాతో తొలిసారిగా దక్షిణాఫ్రికాను ఓడించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 2023 ప్రపంచ కప్‌కు ముందు సూపర్ లీగ్‌లో కావలసిన 10 ముఖ్యమైన పాయింట్లను సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఐదు వికెట్లకు 290 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండీ బాల్‌బిర్నీ సెంచరీతో (117 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు) చెలరేగగా ,మరో బ్యాట్స్‌మెన్ హ్యారీ టెక్టర్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు.అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌట్ కావడంతో   43 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది.