పాకిస్తాన్‌లో బస్సును పేల్చివేసిన ఉగ్రవాదులు..... 

post

పాకిస్తాన్‌లో చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సును ఉగ్రవాదులు పేల్చివేయడంతో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పర్ కోహిస్తాన్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దాసు డ్యామ్ నిర్మాణ పనులకు ఓ బస్సులో చైనా ఇంజినీర్లు, వర్కర్లు వెళుతున్న నేపథ్యంలో బస్సు అకస్మాత్తుగా పేలి లోయలో పడిపోయింది. దానితో నలుగురు చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు వర్కర్లు మృతి చెందారు. అయితే బస్సులో బాంబులు అమర్చారా? లేక రోడ్డు పక్కన బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒక చైనా ఇంజినీర్, మరో సైనికుడు తప్పిపోయారు. వారి ఆచూకీ కోసం బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో మొత్తం 30 మంది ఉన్నట్టు సమాచారం..