తిరుమలకు రాష్ట్రపతి దంపతులు.....

post

ఈరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులతో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్న తరువాత తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కరోనా విస్తరణ కారణంగా రాష్ట్రపతి పర్యటనలో తక్కువ సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అందరికీ కరోనా పరీక్షలు  నిర్వహించారు. విధులు  నిర్వహించే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలను జారీ చేశారు.