మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం..... 

post

ఇంగ్లండ్‌, భారత్ మహిళల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఈ సిరీస్‎ను కూడా భారత్ జట్టు కోల్పోయింది. నెల రోజులుగా సాగిన ఈ టూర్‎లో భారత్ ఆడిన ఒక టెస్టును మాత్రమే డ్రా చేసుకోగలిగింది. తర్వాత ఆడిన వన్డే, టీ20 సిరీస్ లను వరుసగా 2-1తో ఓటమిని చవిచూసింది . బుధవారం భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్‎లో ఓపెనర్‌ స్మృతి మంధాన (70; 51 బంతుల్లో 8x4, 2x6), అర్ధ శతకంతో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36; 26 బంతుల్లో 5x4, 1x6) చెలరేగి ఆడడంతో భారత్ భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేసింది.