బాలికను రక్షించడానికి వెళ్లి బావిలో పడ్డ 40 మంది.....

post

మధ్యప్రదేశ్‌లోని ధిషా సమీపంలోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం 8 సంవత్సరాల బాలిక ఆడుకుంటూ బావిలో పడిపోవడంతో ఆ చిన్నారిని రక్షించడానికి పలువురు గ్రామస్తులు బావి వద్ద నిలబడ్డారు. అయితే ఒకే సారి ఎక్కువ మంది బావి గొడలకు ఒరగడంతో ఒత్తడికి ఆ గోడ కూలి సుమారు 40 మంది బావిలో పడిపోయారు. అయితే వెంటనే వారిని క్షించడానికి అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహాయక చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు 23 మందిని రక్షించారు. వారిలో 13 మందిని ఆసుపత్రికి తరలించారు. నలుగురు మృతి చెందారు. మొదట బావిలో పడ్డ చిన్నారిని ఇంకా బయటకు తీయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.