దక్షిణాఫ్రికా ఘన విజయం....

post

శుక్రవారం దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జేన్‌మన్‌ మలాన్‌ (169 బంతుల్లో 177; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 225 పరుగులు జోడించారు. అనంతరం  347 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 276 పరుగులకు అల్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది .దీనితో  మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1-1తో 'డ్రా'గా ముగిసింది.