శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద.... 

post

రెండు తెలుగు రాష్ట్రలో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 34.1004 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా ఇప్పటికి కూడా కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.