శ్రీలంక పై భారత్ ఘనవిజయం... 

post

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంక, భారత్ మధ్య కొలంబో వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక  9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. అనంతరం 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడ్డడంతో 80 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంక పై భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగులు, ఇషాన్ కిషన్ 59 పరుగులు చేయగా, పృథ్వీషా 43 పరుగులు, మనీష్ పాండే 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశారు.