తీరం దాటిన నివర్...... 

post

నివర్ తుపార్ నిన్న మరింత బలపడి అతి తీవ్ర తుపాన్‌గా మారింది.ఈ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావంచూపడంతో పాటు ఏపీలోని పలు జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్లుగా భారత వాతావరణ శాఖ తెలిపింది .ఈ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొన్నది .ఈ  తుపాన్ తీరం దాటిన సమయంలో గంటకు 120 నుంచి 145 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. తుపాన్ దాటికి చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఈరోజు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.