రెండో వన్డేలో భారత్‌ విజయం..... 

post

శ్రీలంక, భారత్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. చరిత అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) ఆఫ్ సెంచరీలతో చెలరేగగా చమిక కరుణరత్నె (44 నాటౌట్‌), భానుక (36), ధనంజయ (32) రాణించారు. అనంతరం 276 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ మరో 5 బంతులు మిగిలుండగానే  విజయం సాధించింది . భారత్ లో దీపక్‌ చాహర్‌ (69 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (53) ఆఫ్ సెంచరీలతో రాణించగా ,కృనాల్‌ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 276 పరుగుల లక్ష్యఛేదనలో 116 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ను  ఈ ముగ్గురు గట్టెక్కించారు. విజయానికి 84 పరుగులు అవసరమైన దశలో క్రీజులో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ లేకున్నా భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్‌) అండతో దీపక్‌ అద్భుతం చేశాడు. భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్‌ చేజిక్కించుకుంది. దీపక్‌ చాహర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.