న్యూజిలాండ్  విజయం.....

post

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగగా,10 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్( 37 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 75 నాటౌట్) విధ్వంసానికి తోడుగా ఫాబియన్ అలెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్ణయించారు. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 179 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.