స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు......

post

ఈరోజు ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. మొదటి మ్యాచ్లో 66 బంతుల్లో 105 పరుగులు, రెండో వన్డేలో కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. తొలి 50 పరుగులకు 38 బంతులు తీసుకున్న స్మిత్‌ మలి 50 పరుగులకు కేవలం 24బంతులే తీసుకున్నాడు . వన్డేల్లో స్మిత్‌ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా, అందులో
భారత్ పైన 5 సెంచరీలు సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా పాంటింగ్‌ వన్డేల్లో టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటిస్థానంలో ఉన్నాడు.