యూపీలో ఘోర ప్రమాదం......

post

ఈరోజు ఉదయం యూపీ లోని కౌశంబి జిల్లాలో ఇసుక లారీ, స్కార్పియో వాహనం ఢీ కొన్నడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందగా , మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్కార్పియో వాహనంలో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని, అదేవిదంగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు.