న్యూజిలాండ్‌ 243/2....

post

వెస్టిండీస్, న్యూజిలాండ్‌  మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (97 బ్యాటింగ్‌; 219 బంతుల్లో 16×4)తో పాటు ఓపెనర్‌ టామ్‌ లేథమ్‌ (86; 184 బంతుల్లో 12×4, 1×6) రాణించడంతో న్యూజిలాండ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలిరోజు గురువారం ఆట చివరికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 243 పరుగులు సాధించింది.సెంచరీ చేసేలా కనిపించిన లేథమ్, రోచ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఆట ఆఖరికి రాస్‌ టేలర్‌ (31 బ్యాటింగ్‌) జతగా విలియమ్సన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు.వర్షం కారణంగా దాదాపు మూడు గంటలు ఆలస్యంగా మ్యాచ్‌ ఆరంభమైంది.