టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.......

post

టీమిండియా ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నాడని, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సిద్దమవుతున్నాడని జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రోహిత్ శర్మ ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే . గాయం నుంచి కోలుకున్నా, హిట్‌మ్యాన్ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడని పూర్తి ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ సాధించడం కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఆయన 2021లో ఎలాంటి గాయాలు లేకుండా నాన్‌స్టాప్ క్రికెట్ ఆడేలా తనను తాను రెడీ చేసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.