గుడికండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.....

post

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్ల వద్ద కారు బోల్తా పడి సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న చిన్నారి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. మృతులు ఎల్లయ్య (55), గోవిందమ్మ (55), హారిక (22), శారద (56) హైదరాబాద్‌ బడంగ్‌పేట్‌ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.